- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FACT CHECK:రఫేల్ యుద్ధ విమానాలు కూలినట్లు సోషల్ మీడియాలో వైరల్
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ని భారత్ చేపట్టింది. పాక్ లోని 9 టెర్రరిస్టు క్యాంపులపై మెరుపు దాడులు చేపట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ని భారత్ చేపట్టింది. పాక్ లోని 9 టెర్రరిస్టు క్యాంపులపై మెరుపు దాడులు చేపట్టింది. అయితే, ఇలాంటి తరుణంలో భారత్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్‌కు చెందిన కొన్ని శకలాల ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవమని పేర్కొంది. ఆ ఫొటోలు గతంలో కూలిన మిగ్ 21 ఫైటర్ జెట్‌కు సంబంధించినవని వెల్లడించింది. 2021లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో మిగ్21 విమానం కూలిన దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నట్లు పీఐబీ తెలిపింది. ప్రో పాకిస్తానీ యూజర్లు పోస్టు చేస్తున్న మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పాకిస్థాన్‌కు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఆరోపించింది. భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు, భారతీయ ఆర్మీ బేస్‌లపై దాడి చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. భారతీయ సైనిక దళాలను తప్పుడు సమాచారంతో టార్గెట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియన్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు, శ్రీనగర్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమంది.






