తక్షణమే యుద్ధం ఆపేయండి.. భారత్ - పాకిస్తాన్‌కు EU సూచన

by Gantepaka Srikanth |

జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి.

తక్షణమే యుద్ధం ఆపేయండి.. భారత్ - పాకిస్తాన్‌కు EU సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఇటీవల పీవోకేలోని ఉగ్ర స్థావారాలపై భారత బలగాలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాడులు హతమయ్యారు. ఈ క్రమంలోనే భారత్‌ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఓవైపు సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుండగా.. మరోవైపు డ్రోన్ దాడులతో హడలెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు దేశాలకు యూరోపియన్ యూనియన్(European Union) కీలక సూచనలు చేసింది. రెండు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చెప్పింది. పెహల్గాంలో అమాయక పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపిన ఉగ్రవాదులు శిక్షార్హులు అని అభిప్రాయపడింది. ప్రజలను చంపిన ఉగ్రవాదులను మట్టుబెట్టే న్యాయమైన హక్కు భారత్‌‌తో పాటు ప్రతీ దేశానికి ఉందని పేర్కొంది. ఉగ్రవాద చర్యలు సహించరానివి అని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో అటాక్ చేసిన పాక్‌కు భారీ షాక్ తగిలింది. పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం నిర్వీర్యం చేసింది. అంతేకాదు.. రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌‌పై, క్రికెట్ మైదానంపై డ్రోన్ దాడి చేసింది. డ్రోన్ దాడితో లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో పాకిస్తాన్.. చైనా నుంచి తెప్పించుకున్న హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది.

Next Story