Operation Sindoor: పాక్ కాల్పుల్లో ఎనిమిది మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి గాయాలు

by Naga Rani Yarlagadda |

జమ్మూ ప్రాంతంలోని ఆర్ఎస్ పురాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 8 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Operation Sindoor: పాక్ కాల్పుల్లో ఎనిమిది మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ ప్రాంతంలోని ఆర్ఎస్ పురాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 8 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశాన్ని రక్షించేందుకు పోరాడుతున్న జవాన్లకు మద్దతుగా ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) కోరింది.

భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో భద్రతా సిబ్బందికి సకాలంలో వైద్య సహాయం అందించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. సాయుధ దళాలకు సంఘీభావంగా అర్హత కలిగిన దాతలు ముందుకు రావాలని అధికారులు కోరారు. ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌, నౌషోరిలో పాకిస్థాన్ కాల్పుల్ని తీవ్రతరం చేసింది. ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ కాల్పులు జరుపుతుండగా.. భారత ఆర్మీ వాటికి ధీటుగా కౌంటరిస్తోంది.

Next Story