భారత్, పాక్ మధ్య DGMO స్థాయి చర్చలు వాయిదా

by Malleboina Mahesh |

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి.

భారత్, పాక్ మధ్య DGMO స్థాయి చర్చలు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య మే 10, 2025 న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలపరచడం, సరిహద్దుల్లో శాంతిని నిర్వహించడం కోసం షెడ్యూల్ చేయబడ్డాయి. అయితే, ఈ చర్చలు అనూహ్యంగా సాయంత్రానికి వాయిదా వేశారు. ఈ వాయిదా వెనుక గల కారణాల గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. కాగా ఈ DGMO స్థాయి చర్చలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని తెలుస్తుంది.

ఈ భేటీలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ (Rajiv Ghai), పాకిస్థాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి (Kashif Chaudhary) పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)పై చర్చించనున్నారు. పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో తీసుకున్న దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు, సింధూ జలాల అంశంలో భారత ప్రభుత్వం (Government of India) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story