పాకిస్థాన్ దాడులపై భక్తుల ఆగ్రహం.. కామాఖ్య అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు

by Vemula.Srinu Prasad |

పాకిస్థాన్ దాడులపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామాఖ్య అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు..

పాకిస్థాన్ దాడులపై భక్తుల ఆగ్రహం.. కామాఖ్య అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్(Pakistan) సైన్యం కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘించింది. రాత్రి నుంచే డ్రోన్లు(Drones), మిస్సైల్స్‌(Missiles)తో దాడుల చేస్తోంది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్‌కోట్ ప్రాంతాలపై మొత్తం 50 డ్రోన్లను ప్రయోగించింది. దీంతో భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. పాక్ చర్యలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. మొత్తం 50 డ్రోన్లను కూల్చివేసింది.

అయితే ఈ చర్యలను దేశంలోని పలువురు భక్తులు(Devotees) ఖండించారు. అస్సాం గువహతి(Assam Guwahati)లోని కామాఖ్య ఆలయం(Kamakhya Temple)లో ప్రత్యేక పూజలు(Special Pujas) నిర్వహించారు. పాకిస్థాన్ దాడులకు తీవ్రంగా వ్యతిరేకించారు. . పాకిస్తాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టే శక్తిని భారత స్యైన్యానికి ఇవ్వాలని కోరుకున్నారు. ‘‘భారతదేశంపై పాకిస్థాన్ మళ్లీ మళ్లీ దాడి చేస్తోంది. పాకిస్తాన్‌ను నమ్మలేము. మాకు ప్రధాని మోడీ సత్తాపై పూర్తి నమ్మకం ఉంది. మమ్మల్ని రక్షిస్తున్న భారత సైన్యానికి మరింత శక్తిని ఇవ్వండి. అలాగే జవాన్లు కూడా సురక్షితంగా ఇంటికి వెళ్లాలి. భారత సైన్యం చేస్తున్న అద్భుతమైన కృషికి గర్విస్తున్నాం. ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించాలి. భారత జవాన్లకు వందనం చేస్తున్నాం. ’’ అంటూ భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు.

Next Story