- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు
ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను అతి కిరాతంగా హత్య చేశారు. ఈ ఘటనపై యావత్ భారతదేశం ఉలిక్కిపడింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను అతి కిరాతంగా హత్య చేశారు. ఈ ఘటనపై యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. దీంతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి భారత వాయుసేన పీఓకే తో పాటు పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది ఈ దాడిలో దాదాపు 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. ప్రస్తుతానికి 44 మంది ఉగ్రవాదులు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది మాత్రం భారత ఆర్మీని కించ పరిచే విధంగా పోస్టులు పెడుతూ ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు సపోర్టుగా నిలుస్తున్నారు.
అలాంటి వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ (Strong warning) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులను అంతం చేసే వరకు ఈ ఆపరేషన్ సిందూర్ ఆగకూడదని అన్నారు. అలాగే టెర్రరిస్టులపై భారత ప్రభుత్వం చేస్తున్న ఈ పోరాటానికి అందరూ ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పాక్ కు అనుకూలంగా మాట్లాడుతున్న పాకిస్తాన్ ప్రేమికులపై మరోసారి డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, పాకిస్తాన్ ను ప్రేమించే కాంగ్రెస్ నాయకులు (Congress leaders) దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే తాజా పరిస్థితుల్లో ప్రతి పౌరుడు భారత ఆర్మీకి మద్దతుగా నిలవాలని, ఎవరైనా భారత ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






