Operation Sindhoor: ఉగ్రవాదానికి స్థానం లేదు.. ‘ఆపరేషన్ సింధూర్’కు జైకొట్టిన క్రికెటర్లు

by Phanindra |

ఆపరేషన్ సింధూర్‌తో పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టి బదులిచ్చింది. దీనిపై ప్రముఖ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

Operation Sindhoor: ఉగ్రవాదానికి స్థానం లేదు.. ‘ఆపరేషన్ సింధూర్’కు జైకొట్టిన క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషర్ సింధూర్’తో (Operation Sindhoor) టెర్రరిస్టుల స్థావరాలపై నిప్పులు కురిపించింది. ఈ దాడిలో 80 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్ వంటి పలువురు ప్రముఖ క్రికెటర్లు ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిలో ఎవరేమన్నారంటే..?

భయంలేని ఐకమత్యం, అంతులేని శక్తి. భారత దేశపు బలం ఆ దేశ ప్రజలే. ప్రపంచంలో ఉగ్రవాదానికి తావులేదు. మనమంతా ఒకటే టీం! జై హింద్ - సచిన్ టెండూల్కర్

టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ నిలబడింది. భారత్ మాతా కీ జై - శిఖర్ ధవన్

జై హింద్.. పహల్గాంలో అమాయకులైన మన సోదరుల మరణానికి భారత్ జవాబు ‘ఆపరేషన్ సింధూర్’ - హర్భజన్ సింగ్

భద్రతకు సంబంధించిన విషయాల్లో భారత్ సంకోచించదు. ‘ఆపరేషన్ సింధూర్’ ఒక జవాబు మాత్రమే కాదు.. ఒక సందేశం - చేతన్ శర్మ

ధర్మో రక్షతి రక్షితః జై హింద్ సేన - వీరేంద్ర సెహ్వాగ్

ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు భారత ఆర్మీని చూస్తే గర్వంగా ఉంది. ధీశాలులైన జవాన్లకు సెల్యూట్ - ఉమేష్ యాదవ్

వీళ్లేకాకుండా గౌతం గంభీర్, సురేష్ రైనా, అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు కూడా ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindhoor) విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.

Next Story