Operation Sindoor: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
Operation Sindoor: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నెల జీతాన్ని సైన్యానికి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు సైతం వారి వారి నెల జీతాన్ని సైన్యానికి ప్రకటించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనికదాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌తో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, హైదరాబాద్ కమిషనర్ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed