- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రంగా ఉండండి.. ప్రజలకు జమ్మూకశ్మీర్ సీఎం సూచన
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సీఎం ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ చీకటిలో మునిగిపోయింది. ఈ ప్రాంతమంతా బ్లాకౌట్ అమలు చేస్తున్న సైనిక దళాలు.. పాక్ నుంచి వచ్చే డ్రోన్లను నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు భద్రంగా ఉండాలని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. బోర్డర్లో పాకిస్తాన్ దళాలు నిబంధనలు ఉల్లంఘించి ప్రజలపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.
‘జమ్ము, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దు. దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి. లేదంటే దగ్గరలో ప్రశాంతంగా ఉండగలిగే ప్రాంతంలో తలదాచుకొండి. రూమర్లను నమ్మొద్దు. తెలిసీ తెలియని వార్తలను ప్రచారం చెయ్యకండి. ఈ కష్టకాలం నుంచి మనందరం కలిసి బయటపడతాం’ అని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు.
It’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025






