- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock Drill : సివిల్ మాక్ డ్రిల్... కరెంట్ సరఫరా నిలిపివేత
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నేడు దేశంలోని 244 డిఫెన్స్ జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్(Civil Mock Drill) జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నేడు దేశంలోని 244 డిఫెన్స్ జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్(Civil Mock Drill) జరిగింది. ఆపరేషన్ అభ్యాస్(Operation Abhyas) పేరుతో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ఢిల్లీ, గుజరాత్, బీహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో రాత్రి 8 గంటల సమయంలో 15 నిమిషాల పాటు కరెంట్ సరఫరాను నిలిపివేసారు(Blockouts). చీకట్లోనే ఎయిర్ రైడ్ సైరన్లు మోగించి, ప్రజలకు డ్రిల్ నిర్వహించారు. సివిల్ మాక్ డ్రిల్ అనేది యుద్ధం, ఉగ్రదాడి సమయంలో ప్రజలు, అధికారులు ఎలా స్పందించాలో తెలియజేసే ప్రక్రియ వంటిది. కరెంట్ తీసేయడం ఎందుకు అంటే బ్లాక్‌అవుట్ శత్రు విమానాల నుంచి లక్ష్యాలు కనబడకుండా ఉండటం కోసం అని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా జరిగిన ఈ మాక్ డ్రిల్ లో దాదాపు 4 లక్షల మంది వాలంటీర్లు, NCC, NSS, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ప్రజలకు ఫస్ట్ ఎయిడ్, అగ్నిమాపక శిక్షణ ఇచ్చి.. అత్యవసర సమయాల్లో పోలీసు, సైన్యం, వైద్య బృందాలతో ఎలా సమన్వయం చేసుకోవాలో అవగాహన కల్పించింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి రివేంజ్ గా ఇండియన్ ఆర్మీ.. మంగళవారం అర్థరాత్రి ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఇది భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పనిసరి అయితే వైమానిక దాడులు జరగవచ్చనే అనుమానంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది కేంద్ర హోంశాఖ.






