- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ తో యుద్ధం... ధర్మశాల స్టేడియంలో చీర్ గర్ల్ షాకింగ్ వీడియో వైరల్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఓ చీర్

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఓ చీర్ గర్ల్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ధర్మశాల వేదికగా గురువారం రోజున జరగాల్సిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత జమ్మూపై.. పాకిస్తాన్ దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.
ఇలాంటి నేపథ్యంలో.. మ్యాచ్ ను అర్థంతరంగా రద్దు చేశారు. స్టేడియం నుంచి ప్రేక్షకులు అందరినీ వెళ్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కు చీర్ గర్ల్ గా వ్యవహరించిన ఓ లేడీ... సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు చాలా భయంగా ఉందని... ఇక్కడ అన్ని లైట్స్ ఆఫ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలో ఎమోషనల్ అయింది. తనకు భయం గా ఉందని... ప్రాణాలు గుప్పట్లో పెట్టుకున్నామని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
"Very very scary" - Cheer leader's SHOCKING video from Punjab Kings Vs Delhi Capitals IPL match in Dharamshala. pic.twitter.com/S830aDKer3
— Manobala Vijayabalan (@ManobalaV) May 8, 2025






