పాకిస్తాన్ లోని 6 స్థావరాలలో దాడి... BLA అధికారిక ప్రకటన

by velandi.Saikiran |

పాకిస్తాన్ పై దాడి చేసినట్లు అధికారికంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army) ప్రకటన చేసింది. పాకి

పాకిస్తాన్ లోని 6 స్థావరాలలో దాడి... BLA అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పై దాడి చేసినట్లు అధికారికంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army) ప్రకటన చేసింది. పాకిస్తాన్ లోని మొత్తం ఆరు స్థావరాలలో దాడులు చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. క్వెట్టా, హాజరే నగరాలలో కూడా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడులలో పాకిస్తాన్ జవాన్ మృతి చెందినట్లు కూడా వెల్లడించింది. పాకిస్తాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని, వాళ్ల వాహనాలను కూడా పేల్చినట్లు వివరించింది.

రిమోట్ బాంబులతో కూడా... పాకిస్తాన్ శిబిరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది BLA. అదే సమయంలో పాకిస్తాన్ ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బలూ చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమాత్రం సపోర్ట్ చేయకూడదని... ఈ సందర్భంగా వెల్లడించింది BLA.

ఒకవేళ పాకిస్తాన్ సైన్యానికి సహకరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇది ఇలా ఉండగా... పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు అక్కడి ప్రజలు. చాలామంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ విఫలమయ్యాడని... ఈ పాలన తమకు వద్దని స్వయంగా జనాలే రోడ్లపై నిరసన తెలుపుతున్నారు.

Next Story