- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaish HQ: మెరుపు దాడుల్లో జైషే హెడ్ క్వార్టర్ ధ్వంసం
పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో బహవల్పూర్లోని జైషే హెడ్ క్వార్టర్ ధ్వంసమైంది. దీన్ని భారత ఆర్మీ భారీ విజయంగా భావిస్తుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో బహవల్పూర్లోని జైషే హెడ్ క్వార్టర్ ధ్వంసమైంది. దీన్ని భారత ఆర్మీ భారీ విజయంగా భావిస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలను బీజేపీ (BJP) అధికార ప్రతినిధి అమిత్ మాల్వీయ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కాగా.. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ‘‘పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్ మర్కజ్ సుబాన్.. జైషే ముఠా హెడ్‌క్వార్టర్. ఈ ఉగ్రశిబిరంలోనే ఎన్నో విధ్వంసాలకు జైషే కుట్ర పన్నింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇప్పుడు ఆ స్థావరం ధ్వంసమైంది’’ అని మాల్వీయ రాసుకొచ్చారు. అయితే, ఆపరేషన్‌కు ముందు, తర్వాత ఆ టెర్రరిస్టు క్యాంపు ఎలా ఉందో వీడియోలో కన్పించింది. దాడి వల్ల భవనం దెబ్బతింది. గోడలు కూలిపోయాయి. పెద్ద అగాధం కూడా ఏర్పడింది.
జైషే చీఫ్ మసూద్ కుటుంబసభ్యులు మృతి
ఇకపోతే, ఇదే స్థావరంలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది చనిపోయారు. అంతేకాక, అతడి నలుగురు అనుచరులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, ఈ శిబిరాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వాడుతున్నాడు.ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ఆపరేషన సిందూర్ పేరుతో మే 7న తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకు త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ దాడులు చేపట్టాయి. మొత్తం 9 టెర్రర్ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో మెరుపు దాడి చేసి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఈ దాడిలో 70 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 60 మంది గాయపడినట్లు సమాచారం.






