BLA : పాక్ కు భారీ షాక్.. క్వెట్టాను స్వాధీనం చేసుకున్న బలుచిస్తాన్ ఆర్మీ

by Muthe.Rajitha |

పాకిస్తాన్(Pakistan)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

BLA : పాక్ కు భారీ షాక్.. క్వెట్టాను స్వాధీనం చేసుకున్న బలుచిస్తాన్ ఆర్మీ
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్(Pakistan)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాక్ లోని ప్రధాన భూభాగాన్ని బలుచిస్తాన్(Balochistan)స్వాధీనం చేసుకుందని సమాచారం. ఒకవైపు భారత్ భీకర దాడులు చేస్తుండగా.. మరోవైపు బలుచిస్తాన్ విరుచుకు పడుతోంది. భారత్(India), బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA)దాడులతో పాక్ కు కంటి మీద కునుకు లేకుండా తయారైంది. కాగా BLA పాకిస్తాన్ లోని క్వెట్టా(Quetta)ను చుట్టు ముట్టి తమ అధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులు ఎత్తేసిందని, దాంతో క్వెట్టా BLA స్వాధీనం అయిందని సమాచారం.

ఇదిలా ఉండగా.. పాక్ ప్రజలకు BLA స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలు ఎవరూ సహకరించ కూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వారికి సహకరించిన సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. కాగా బలూచ్ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా పాక్ లోని 6 ప్రాంతాలపై దాడులు చేసినట్టు BLA ప్రకటించుకుంది.

పహల్గం ఉగ్రదాడి(pahalgam terror attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(operartion sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఎటాక్ దిగగా.. భారత్ గట్టిగా బదులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా పాక్ పై ప్రతిదాడికి దిగింది. పాక్ కీలక నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్ పై వైమానిక దాడులు, మిస్సైల్స్ తో విరుచుకు పడింది.

Next Story