Operation Sindoor: యుద్ధానికి తాత్కాలిక విరామం మాత్రమే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్‌(Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు.

Operation Sindoor: యుద్ధానికి తాత్కాలిక విరామం మాత్రమే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్‌(Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ తిరంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసిందని అన్నారు. వ్యూహాత్మకంగా టెర్రరిస్టులను చావుదెబ్బ కొట్టిన సైన్యానికి సలాం చేశారు. ప్రస్తుతం యుద్ధానికి తాత్కాలిక విరామం తీసుకున్నామని అన్నారు. మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ లేకుండా పోవడం ఖాయమని బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ కావాలని ఎవరి జోలికి వెళ్లదని.. మమ్మల్ని కెలికితే మాత్రం పరిస్థితి వేరే ఉంటుందని అన్నారు. మన మహిళల నుదుటి సిందూరాన్ని తుడిచేస్తే.. ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. మోడీ దమ్ము ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని చెప్పారు. ఎవరి సాయం తీసుకోకుండా సింగిల్‌గానే పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టామని అన్నారు.

Next Story