హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడంపై నిషేదం.. ఆర్డర్ జారీ చేసిన సీవీ ఆనంద్

by Mahesh |
హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడంపై నిషేదం.. ఆర్డర్ జారీ చేసిన సీవీ ఆనంద్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడంపై నిషేదం (Ban on fireworks) విదిస్తూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్ ఆర్డర్ జారీ చేశారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశం అంతటా హై అలర్ట్ పరిస్థితి ఉండటం, తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భద్రతా సన్నాహక చర్యల కొనసాగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం, 1348 ఫస్లీ (నం. IX) సెక్షన్ 67 (సి) కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ, ప్రజా భద్రత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్, చుట్టుపక్కల, పబ్లిక్ స్థలాల్లో బాణసంచా లేదా ఫైర్‌వర్క్‌లను పేల్చడం కఠినంగా నిషేధించబడినట్లు సామాన్య ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో బాణసంచా(fireworks) నుంచి వచ్చే భారీ శబ్దాలు సంక్షోభ సంకేతాలు, పేలుడు, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపంగా సులభంగా తప్పుగా అర్థం అయ్యే అవకాశం ఉంది.

ఇది ప్రజల్లో భయాందోళనకు దారితీసి, ప్రజా శాంతి భద్రతలకు భంగ పరచవచ్చని, అలాగే ఈ బాణసంచా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి కలిగించవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి భద్రతా చర్యలు, నిరంతర జాగ్రత్తల దృష్ట్యా, ఇటువంటి చర్యలు ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్ట వచ్చని ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడాన్ని సంక్లిష్టం చేయవచ్చని అభిప్రాయంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అలాగే ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు ఎంతటి వారు అయినా సంబంధిత చట్టాల కింద చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, బాణాసంచాపై నిషేద ఆదేశం వెంటనే అమలులోకి వస్తుందని, తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కాగా ఈ నిషేదానికి సంబంధించిన ఆర్డర్స్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.



Next Story

Most Viewed