అమీర్ ఖాన్ కొత్త సినిమాకు నిరసనల సెగ

by Ajay Maddhiboyina |

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తాజాగా సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటించారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అమీర్ ఖాన్ కొత్త సినిమాకు నిరసనల సెగ
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తాజాగా సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటించారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2007లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే బాలీవుడ్ స్టార్ హీరోకు నిరసన సెగ తగులుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బైకాట్ సితారే జమీన్‌పర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు.

పహల్గామ్ ఘటన తరవాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై అమీర్ ఖాన్ ఎప్పుడూ గొంతు విప్పలేదు. అంతే కాకుండా ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు పలికిన తుర్కియే దేశ అధ్యక్షురాలిని అమీర్ ఖాన్ గతంలో కలిశారు. దీంతో అప్పుడు అమీర్ ఖాన్ తుర్కియే దేశ అధ్యక్షురాలిని కలిసిన వీడియోను వైరల్ చేస్తూ అమీర్‌ఖాన్‌పై మండిపడుతున్నారు. అప్పుడు తుర్కియేలో సరదాగా గడిపి ఇప్పుడు వాళ్లు మనపై దాడి చేస్తున్న సమయంలో తన సినిమాకు మద్దతు కోరుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. సితారే జమీన్‌పర్‌ను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story