53 మంద్రి దేశద్రోహులను జైల్లో వేశాం..అస్సాం సీఎం షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీల‌కు అతీతంగా ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల‌కు స‌పోర్ట్ చేశారు.

53 మంద్రి దేశద్రోహులను జైల్లో వేశాం..అస్సాం సీఎం షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీల‌కు అతీతంగా ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల‌కు స‌పోర్ట్ చేశారు. ప్ర‌జ‌లు కూడా కుల మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తిఒక్క‌రూ భార‌త్ వైపు నిలిచారు. కానీ కొంత‌మంది మాత్రం ఇండియాలో ఉంటూ ఈ నేల‌పై పండుతున్న తిండి తింటూ పాకిస్థాన్ కు మ‌ద్ద‌తు ప‌లికారు. కాగా త‌మ రాష్ట్రంలో అలాంటి వారిని గుర్తించి జైలుకు పంపిన‌ట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ లో ట్వీట్ చేశారు. భార‌త ప్ర‌భుత్వం వంద మంది పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను చంపేస్తే తాము త‌మ రాష్ట్రంలోని 53 మంది దేశ‌ద్రోహుల‌ను గుర్తించిన‌ట్టు చెప్పారు. మే 11 రాత్రి 10.30 నిమిషాల వ‌ర‌కు 53 మందిని గుర్తించామ‌ని చెప్పారు. ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో వారిని అరెస్ట్ చేసిన‌ట్టు సీఎం ప్ర‌క‌టించారు. కాగా వీరు సోష‌ల్ మీడియాలో పాకిస్థాన్ కు మ‌ద్ద‌తుగా పోస్టులు పెట్ట‌నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం హిమంత బిశ్వ శ‌ర్మ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో ఆయ‌న‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Next Story