'Ashes To Ashes': రక్షణ అధికారుల నోట.. విరాట్ రిటైర్మెంట్ మాట..

by Shamantha N |

గత కొన్నేళ్లుగా ఉగ్రవాదుల స్వభావం మారిపోయిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్ (Lieutenant General Rajiv Ghai) అన్నారు.

Ashes To Ashes: రక్షణ అధికారుల నోట.. విరాట్ రిటైర్మెంట్ మాట..
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్నేళ్లుగా ఉగ్రవాదుల స్వభావం మారిపోయిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్ (Lieutenant General Rajiv Ghai) అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ శాఖ చేప్టటిన బ్రీఫింగ్ లో ఆయనక కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం తీరులో మార్పు వచ్చింది. ఉగ్రవాదులు తమ స్వభావాన్ని మార్చుకున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పర్యాటకులు, భక్తులు, యాత్రికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు’ అని అన్నారు. అంతేకాకుండా కోహ్లీ రిటైర్ మెంట్ గురించి ప్రస్తావించారు. సోమవారం కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారని.. తనకు అతనే ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి లింక్ పెడుతూ.. ఓ క్రికెట్ స్టోరీ చెప్పారు.

యాషెస్ టు యాషెస్

భారత ఎయిర్ ఫీల్డ్‌ల‌ను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయ‌డం చాలా క‌ఠిన‌మైన అంశమని రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆ అంశాన్ని ఆయ‌న వివ‌రిస్తూ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ గురించి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. “ 1970 ద‌శ‌కంలో యాషెస్ సిరీస్ ఒక‌టి జ‌రిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు బౌల‌ర్లు ఇంగ్లండ్ బ్యాట‌ర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైన‌ప్‌ను ఆస్ట్రేలియా బౌల‌ర్లు జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీలు కూల్చేశారు. ఆ స‌మ‌యంలో ఆస్ట్రేలియాలో ఓ నానుడి వ‌చ్చింది. యాషెస్ టు యాసెస్‌.. డ‌స్ట్ టు డ‌స్ట్‌.. ఇఫ్ థామో డోంట్ గెట్ యా.. లిల్లీ మ‌స్ట్‌ ( ఒకవేళ థాంప్సన్ ను తప్పించుకున్న.. లిల్లీకి చిక్కాల్సిందే) అనే ప్రోవర్బ్ పుట్టింది. మన గగనతల రక్షణ వ్యవస్థలోని దశలను చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. శత్రువులు ఎన్ని హద్దులు దాటి వచ్చినా.. ఈ గ్రిడ్‌ సిస్టమ్‌లోని ఒక లేయర్‌ వారిపై పోరాటం చేస్తుంది. మన ఎయిర్‌ డిఫెన్స్‌ అంత శక్తిమంతమైనది, విలువైనది’’ అని వెల్లడించారు.

Next Story