కాసేపట్లో అఖిలపక్ష సమావేశం.. చర్చకు వచ్చే కీలక అంశాలివే!

by Kema Shiva Kumar |

ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్‌గా ‘ఆపరేషన్ సిందూర్‌’ (Operation Sindoor)లో భాగంగా ఇండియన్ ఆర్మీ పాక్, పీవోకేల‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది.

కాసేపట్లో అఖిలపక్ష సమావేశం.. చర్చకు వచ్చే కీలక అంశాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్‌గా ‘ఆపరేషన్ సిందూర్‌’ (Operation Sindoor)లో భాగంగా ఇండియన్ ఆర్మీ పాక్, పీవోకేల‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో ప్రముఖ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తోయిబా (Lashkar-e-Taiba), జైష్-ఎ-మహమ్మద్ (Jaish-e-Mohammed) ప్రధాన కార్యాలయాల‌తో పాటు ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు సైతం నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అధ్యక్షత వ్యవహించనుండగా హోంమంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్‌ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది, భవిష్యత్తుల్లో రాబోయే పరిణామాలపై వారికి స్పష్టంగా వివరించనుంది. ఈ సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో పాటు పలువురు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది.

Next Story