- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టర్కీకి మరో షాక్.. 50 శాతం టికెట్లు రద్దు చేసుకున్న టూరిస్టులు
పాకిస్థాన్‌కు సాయం చేసిన టర్కీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముఖ్యంగా భారత్ నుండి ఆ దేశ పర్యాటక రంగానికి ఎక్కవ ఆదాయం ఉండటంతో భారతీయులు అక్కడకు వెళ్లేందుకే ఇష్టపడటం లేదు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌కు సాయం చేసిన టర్కీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముఖ్యంగా భారత్ నుండి ఆ దేశ పర్యాటక రంగానికి ఎక్కవ ఆదాయం ఉండటంతో భారతీయులు అక్కడకు వెళ్లేందుకే ఇష్టపడటం లేదు. దీంతో టర్కీ, అజర్‌బైజన్‌కు 60శాతం బుకింగ్‌లు పడిపోయాయి. అంతే కాకుండా ఇప్పటికే బుక్ చేసుకున్న టూరిస్టులు కూడా 50శాతం మంది రద్దు చేసుకున్నట్టు మాజీ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జ్యోతి మాయల్ వెల్లడించారు.
టర్కీ మరియు అజర్‌బైజాన్‌కు టూరిజం ద్వారా భారత్ ఎంతో సాయం చేసిందన్నారు. భారత్‌పై వారి వక్రబుద్ది చూపించినందుకు మనం కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ దేశాలకు వెళ్లేందుకు టూరిస్టులకు మనం సహాయం చేయకూడదని చెప్పారు. మరోవైపు బైకాట్ టర్కీ నినాదంపై ఈజీ ట్రిప్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి స్పందించారు. టర్కీ, అజర్ బైజార్ దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని తెలిసినప్పుడు అక్కడకి టూరిస్టులు వెళ్లవద్దని మొదట తామే చెప్పామన్నారు. ఆ తరవాత పలు ట్రావెల్ ఏజెన్సీలు సైతం సూచిస్తున్నాయని తెలిపారు.






