Sindoor: యూపీలో 17 మంది చిన్నారులకు సిందూర్ పేరు

by Shamantha N |

పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కాగా.. ఈ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.

Sindoor: యూపీలో 17 మంది చిన్నారులకు సిందూర్ పేరు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కాగా.. ఈ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు వారి తల్లిదండ్రులు ‘సిందూర్‌’ అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మే 10, 11 తేదీల్లో కుషినగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 17 మంది ఆడపిల్లలు జన్మించారు. అయితే, ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలకు ‘సిందూర్‌’ అని పేరు పెట్టినట్లు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే షాహి ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఆపరేషన్ సిందూర్

ఇకపోతే, పహెల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ పై గర్విస్తున్నామని కుషినగర్‌కు చెందిన అర్చన షాహి తెలిపారు. అందుకే తమ కుమార్తెకు ‘సిందూర్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. మరోవైపు, తన కుమార్తె పెద్దయ్యాక తన పేరులోని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు. దేశం పట్ల విధేయతో శిశవు ఎదుగుతుందని వ్యాసముని అనే వ్యక్తి అన్నారు. ‘సిందూర్’ పేరు తన కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని పద్రౌనా ప్రాంతానికి చెందిన ప్రియాంక దేవి అన్నారు.

Next Story