ఓటీటీలోకి రాబోతున్న ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’.. అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’. ఇందులో స్టార్ బ్యూటీ అంజలి కూడా కీలక పాత్రలో కనిపించింది.

ఓటీటీలోకి రాబోతున్న ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’. ఇందులో స్టార్ బ్యూటీ అంజలి కూడా కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాను కృష్ణ చైతన్య బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించగా.. సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీగ్రాండ్‌గా మే 31న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా బ్రేక్ ఈవెన్ కూడా సాధించిన అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.

తాజాగా, గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. దీని ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి జూన్ 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుందంటూ అధికారిక ప్రకటన విడుదలైంది. అలాగే ‘‘మనుషులు మూడు రకాలు. నాశి రకం, రెండోది బోషి రకం, మూడోది నాణ్యమైన రకం. ఈ మూడిటిని ధాటి చరిత్రలో మిగిలిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసి సినీ ప్రియులు సంతోష పడుతున్నారు. అయితే ఆ మూవీ విడుదలై నెల కాకముందే ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.

Next Story