- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి తెలుగులో రాబోతున్న తమిళ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
గత కొద్ది కాలంగా చిన్న సినిమాలు ఓటీటీలో ఫుల్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా చిన్న సినిమాలు ఓటీటీలో ఫుల్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల వచ్చిన తమిళ మూవీ ప్రేమలు ఊహించని విధంగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు తమిళ థ్రిల్లర్ డ్రామా సినిమా బర్త్‌మార్క్ ఓటీటీలోకి రాబోతుంది. షబీర్ కల్లరక్కల్, మీర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్స్‌లో విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. బర్త్‌మార్క్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదలైంది. అంతేకాకుండా లోకం చూడబోతున్న శిశువు.. కానీ కాలమే తన శత్రువు అనే క్యాప్షన్ జత చేశారు.






