థియేటర్‌కు రాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
థియేటర్‌కు రాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, రకుల్ జంటగా నటించిన సినిమా ‘అయలాన్’. దీనిని డైరెక్టర్ రవికుమార్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళ బాషలో రిలీజ్ అయి ప్రేక్షకుల్లో హిట్ టాక్‌ను అందుకుంది. దీంతో అయలాన్ తెలుగులోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఏమైందో తెలియదు కానీ థియేటర్స్‌లో విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ నిరాశలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. అయలాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా, సినీ ప్రియులకు సన్ నెక్ట్స్ గుడ్ న్యూస్ తెలిపింది. ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమిళం, తెలుగు బాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed