- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ‘తుపాకుల గూడెం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
జైదీప్ విష్ణు డైరెక్షన్‌లో గత ఏడాది వచ్చిన చిత్రం తుపాకుల గూడెం. ఇందులో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్ జయేత్రి, వినీత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

దిశ, సినిమా: జైదీప్ విష్ణు డైరెక్షన్‌లో గత ఏడాది వచ్చిన చిత్రం తుపాకుల గూడెం. ఇందులో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్ జయేత్రి, వినీత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 3న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, తుపాకుల గూడెం డిజిటల్ స్ట్రీమింగ్ మక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతొంది. అయితే ఈ సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్ డ్రాప్‌తో ఉన్నట్లు సమాచారం. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలతో పాటు పోలీస్ ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే దానిపై కథ తిరుగుతుందట. కాగా ఈ సినిమా దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
#RebelsOfThupakulagudem OTT RELEASE FEBRUARY 8 @etvwin pic.twitter.com/nbrnAZ0GVV
— OTTGURU (@OTTGURU1) February 5, 2024






