- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’.. క్లారిటీ ఇస్తూ మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha).

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha). చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో దుమ్మురేపుతుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా సెప్టెంబరులో గానీ.. లేదా అక్టోబర్‌లోగానీ స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ స్పందించింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకుంది. “మహావతార్ నరసింహ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందనే ప్రచారం మా దృష్టికి వచ్చింది. దానిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మేము ఖరారు చేయలేదు. మా సోషల్ మీడియా ఖాతాలో వచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మండి ” అంటూ పోస్ట్ చేసింది. దీంతో మహవతార్ నరసింహ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై స్పష్టత వచ్చింది. కాగా ఈ యానిమేషన్ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.






