- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే.. ఓటీటీలో అదరగొడుతున్న హార్రర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అయితే.. ఓటీటీలో అదరగొడుతున్నాయి.

దిశ,వెబ్ డెస్క్: థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీల్లో మాత్రం బాగా అలరించడం ఈ మధ్య ట్రెండు అయిపొయింది. ముఖ్యంగా హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అయితే.. ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇప్పడు అలాంటి సినిమానే ఓటీటీలోకి వచ్చేసింది. అదే..తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1. ఈ సినిమాలో శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు. అక్టోబర్ 13న ఈ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజైన కొన్ని రోజులకే మాయమైపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండానే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తంతిరం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం నవంబర్ 11 నుంచే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా మారిందన్న పాయింట్‌పై తంతిరం సినిమాను తెరకెక్కించారు.






