సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి ‘హాయ్ నాన్న’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Disha Web Desk 6 |
సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి ‘హాయ్ నాన్న’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. దీనిని శౌర్యవ్ తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. తండ్రి కూతురు మధ్ సాగె ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా థియేరట్స్‌కు వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అయి మొదటి షోతోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హాయ్ నాన్నలో నాని తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

కలెక్షన్లు కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా, అందుతున్న సమాచారం ప్రకారం హాయ్ నాన్న సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీని ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్.

Next Story

Most Viewed