చిత్ర నిర్మాణ రంగంలోకి గ్రీన్‌ గోల్డ్‌ గ్రూప్‌

by Sridhar Babu |

వరల్డ్‌ యానిమేషన్‌ రంగంలో అద్భుతమైన ప్రతిభ చాటిన గ్రీన్‌ గోల్డ్‌ గ్రూప్‌ ఇప్పుడు చిత్ర నిర్మాణరంగంలోకి రానుంది.

చిత్ర నిర్మాణ రంగంలోకి గ్రీన్‌ గోల్డ్‌ గ్రూప్‌
X

దిశ, వెబ్​డెస్క్​ : వరల్డ్‌ యానిమేషన్‌ రంగంలో అద్భుతమైన ప్రతిభ చాటిన గ్రీన్‌ గోల్డ్‌ గ్రూప్‌ ఇప్పుడు చిత్ర నిర్మాణరంగంలోకి రానుంది. చిలకా ప్రొడక్షన్స్‌ పేరుతో ఈ సంస్థ చిత్రాలను నిర్మించనుంది. దీనికి సంబంధించిన లోగోను నిర్మాత అల్లు అరవింద్‌ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్‌ చిలక మాట్లాడుతూ లయన్‌ కింగ్‌ సినిమా చూశాక ఇలాంటి చిత్రాన్ని ఇండియాలో ఎందుకు తీయకూడదని అనిపించింది. వాల్ట్‌ డీస్నీ నాకు ఎప్పుడూ ఓ ఇన్‌స్ప్రెషన్‌. తాను యానిమేషన్‌ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి. వాటిని అధిగమించి సిన్సియర్‌గా కష్టపడుతూ వచ్చాం. కృష్ణ, చోటా బీమ్‌ వంటి యానిమేటెడ్‌ ఫిల్మ్స్‌ తీశాం. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రం తీస్తున్నాను. ఇవి కాకుండా చాలా ప్లాన్స్‌ ఉన్నాయి. పరిశ్రమలో అల్లు అరవింద్‌గారిలా ఎదగాలని ఉంది అని అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసే వ్యక్తుల్ని, సంస్థలను పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు.

Next Story