అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ

by Disha Web Desk 6 |
అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున ఇటీవల నటించిన సినిమా ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. హాస్య నటుడు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. చాలా కాలం తర్వాత నాగార్జున సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

నా సామి రంగ సంక్రాతి కానుకగా జనవరి 13న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ నా సామి రంగ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. డేట్ గెస్ చేయండి? అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 14, 16న స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed