‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేది ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేది ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: ఖుషీ హిట్ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ మూవీని గీతా గోవిందం డైరెక్టర్ పరశురామం రూపొందించగా.. క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై.. దిల్, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. అయితే నేడు ఏప్రిల్ 5న గ్రాండ్‌గా విజయ్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీని స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా, అందుతున్న సమాచారం ప్రకారం.. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని సమాచారం. ఇందుకుగానూ ఈ సంస్థ భారీ మొత్తంలో చెల్లించారట. అయితే ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను మెప్పించలేకపోతే ముందుగానే వచ్చేస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.



Next Story