భారీ గుడ్ న్యూస్.. 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా

by Disha Web Desk 6 |
భారీ గుడ్ న్యూస్.. 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. దీనిని డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించగా.. ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా, ఫ్యామిలీ స్టార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. దీంతో సినీ ప్రియులకు సంతోషపడుతున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఊహించని విధంగా విడుదలై 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది.






Next Story