డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ‘డియర్ నాన్న’.. అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు చైతన్య బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు.

డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ‘డియర్ నాన్న’.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు చైతన్య బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవల పారిజాత పర్వం మూవీతో అలరించాడు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. చైతన్య ప్రధాన పాత్రలో నటించిన డియర్ నాన్న డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో నటుడు సూర్య కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జూన్ 16న ఫాదర్స్ డే సందర్భంగా డియర్ నాన్న స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసి సినీ ప్రియులను సంతోష పెట్టారు.

Next Story