Daku Maharaj: బాలయ్య బాబు 'డాకు మహారాజ్' ఓటీటీ టైం అండ్ పార్టనర్ ఫిక్స్..?

by Gugulothu.Kavitha |

నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

Daku Maharaj: బాలయ్య బాబు డాకు మహారాజ్ ఓటీటీ టైం అండ్ పార్టనర్ ఫిక్స్..?
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆదివారం (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధిచిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీ డిజిటల్ హక్కులు భారీ మొత్తం ఖర్చు చేసీ మరీ నెట్‌ఫ్లిక్స్(Net Flix) సొంతం చేసుకుంది. అయితే 4 వీక్స్ తర్వాత ఈ సినిమా ఓటీటీ(OTT)లోకి స్ట్రీమింగ్ అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఓటీటీ రిలీజ్‌పై సితార నిర్మాతలు స్పందిస్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారు తమ సినిమాలను భారీ స్థాయిలో బిజినెస్ జరిగేలా ప్లాన్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించారు. ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతున్న డాకు మహారాజ్ ఓటీటీలో కూడా అదే రేంజ్‌లో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story