ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. అవి రాకూడదంటే అదనంగా చెల్లించాల్సిందే

by Naga Rani Yarlagadda |

యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికోసం కొత్తగా మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో మెంబర్ షిప్ ఉన్నవారు నెలకు ..

ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. అవి రాకూడదంటే అదనంగా చెల్లించాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video).. యూజర్లకు మళ్లీ షాకిచ్చింది. ఇప్పటివరకూ ఏ ప్లాన్ తీసుకున్న యాడ్ ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ ఉండేది. కానీ వచ్చే నెల నుంచి సినిమాలు, షో స్ట్రీమింగ్స్‌లో యూజర్ తీసుకునే ప్లాన్స్‌ను బట్టి యాడ్స్ కనిపించనున్నాయి. యాడ్స్ లేకుండా స్ట్రీమింగ్ కావాలంటే యూజర్ అదనంగా చెల్లించక తప్పదు. మెరుగైన కంటెంట్ ను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్.. తన యూజర్లకు పంపిన మెయిల్ లో తెలిపింది. చిరాకు తెప్పించే యాడ్స్ కాకుండా.. అర్థవంతమైన యాడ్స్ ను మాత్రమే స్ట్రీమ్ చేస్తామని చెప్పింది. జూన్ 17 నుంచి ఇది అమల్లోకి రానుంది.

కాగా.. యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికోసం కొత్తగా మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో మెంబర్ షిప్ ఉన్నవారు నెలకు రూ.129, ఏడాదికి రూ.699 యాడ్ ఆన్ ప్లాన్స్ తీసుకుంటే ఎలాంటి యాడ్స్ కనిపించవని తెలిపింది. కాగా.. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, యూకే, యూఎస్ లలో ప్రైమ్ వీడియోలో యాడ్స్ కూడా వస్తున్నాయి. భారత్‌లో ప్రైమ్‌లైట్ ప్లాన్ తీసుకున్నవారికి కూడా యాడ్స్ వస్తుండగా.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి కూడా ఇది వర్తించనుంది.

Next Story