Retro Twitter Review: రెట్రో మూవీ ట్విట్టర్ రివ్యూ.. కనిపించని హంగామా

by I. Sairam |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటించిన లేటేస్ట్ మూవీ ‘రెట్రో’(Retro).

Retro Twitter Review: రెట్రో మూవీ ట్విట్టర్ రివ్యూ.. కనిపించని హంగామా
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటించిన లేటేస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రంలో జయరాం, బోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. అయితే దీనిని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ(Naga Vamsi) రిలీజ్ చేశారు. మేడే సందర్భంగా గురువారం ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెల్లవారుజామున నుంచే ఈ సినిమాకు రివ్యూస్ ఇస్తున్నారు అడియన్స్. ఇంతకీ సూర్య నటించిన ఈ రెట్రో మూవీ ఎలా ఉందో చుద్ధామా..

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఎర్లీ షోలు ఎక్కడా వేయలేదని సమాచారం. రెట్రో మూవీకి ముందుగా షోలు వేస్తే నెగెటివిటీ వస్తుందనే అభిప్రాయంతోనే ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ఇంకా షోలు పడలేదేంటి? అని జనాలు ట్విట్టర్లో అనుకుంటున్నారు. అసలు ఈ మూవీ సందడి కూడా ఎక్కడా కనిపించడం లేదే? అని ట్వీట్లు చేస్తున్నారు.

ఎందుకు ఇంత ఆలస్యంగా షోలు వేస్తున్నారు.. అసలు ఓవర్సీస్‌లో ఎర్లీగా ఎందుకు షోలు పడలేదని అంతా అనుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆల్రెడీ ఓవర్సీస్ నుంచి నెగెటివ్ రివ్యూలు వచ్చేశాయ్ అని కామెంట్లు పెడుతున్నారు. మరి ట్విట్టర్‌లో అయితే రెట్రోకి సంబంధించిన ఒక్క క్లిప్ కూడా కనిపించడం లేదు. అసలు సూర్య సినిమా వచ్చిందన్న వార్త కూడా ఎవ్వరికీ తెలిసినట్టుగా అనిపించడం లేదు.

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story