2024 పార్లమెంట్ ఎన్నికల్లో 642 మిలియన్ల ఓటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించాము: CEC రాజీవ్ కుమార్

by Malleboina Mahesh |

2024 పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం CEC రాజీవ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో 642 మిలియన్ల ఓటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించాము: CEC రాజీవ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం CEC రాజీవ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున్న పోలింగ్ లో పాల్గోన్నారని.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 642 మిలియన్ల ఓటర్లతో తాము ప్రపంచ రికార్డు సృష్టించామని ప్రకటించారు. అలాగే ఈ ఓట్ల పోలింగ్ అన్ని G7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ, EU లోని 27 దేశాలలోని ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ" అని CEC రాజీవ్ కుమార్ చెప్పారు. అలాగే జూన్ 4న దేశవ్యాప్తంగా ఏక కాలంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని.. దీనికోసం ఇప్పటికే పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రాజకీయ పార్టీలు తమపై చేసిన అభియోగాలన్నింటికి సమాధానాలు చెబుతామని CEC రాజీవ్ కుమార్ అన్నారు.

Next Story