- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధే ప్రధాన మంత్రి.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేసీఆర్‌లో మార్పు రాకపోవడంతో.. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారని అన్నారు. కాగా, కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 296 సీట్లు, ఇండియా కూటమి 228 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Next Story






