- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన ఎంపి అభ్యర్థి ముఖంపై కలెక్టర్ సీలు ముద్ర.. అందోళనకు దిగిన టిడిపి శ్రేణులు
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

దిశ,కాకినాడ జిల్లా ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. బ్యాలెట్ పేపర్లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముఖం కనిపించకుండా కలెక్టర్ సీల్ ముద్ర వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో ఓటర్లకు ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముఖం కనిపించని పరిస్థితి ఏర్పడింది.
దీనితో అధికారులపై తెలుగుదేశం తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 14 గ్రామాల్లో జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర పడింది. దీంతో ఈ విషయంలో ఆర్వోకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఆర్వో దిద్దుబాటు చర్యలకు దిగారు. పోలింగ్ ప్రారంభానికి ముందే బ్యాలెట్ పేపర్లో ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. పోలింగ్ ప్రారంభం కాకముందే అయా ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి.






