Telangana MP Elections 2024: 15 ఏళ్ల తరువాత ఓటేసుకున్న ఎంపీ అభ్యర్థి..

by Indraja |

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

Telangana MP Elections 2024: 15 ఏళ్ల తరువాత ఓటేసుకున్న ఎంపీ అభ్యర్థి..
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అలానే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ఓటర్లతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తాజాగా సికింద్రాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మోండా మార్కెట్లోని ఇస్లామియ హైస్కూల్లో ఓటు వేశారు. కాగా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన ఓటును తనకే వేసుకున్నారు. 2009లో తన ఓటు తనకే వేసుకున్న పద్మారావు ఆ తరువాత మళ్లీ ఎప్పుడు తన ఓటును తనకే వేసుకోలేదు.

పద్మారావు సికింద్రాబాద్ వాసి అయినప్పటికీ మోండా మార్కెట్ సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఎంపీ అభ్యర్థిగా అక్కడే నుండే పోటీ చేస్తుండడంతో ఈ రోజు తన ఓటు తనకే వేసుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story