ఐపీఎల్ పునఃప్రారంభానికి వరుణుడి ముప్పు

by Phanindra |

ఐపీఎల్ పునఃప్రారంభానికి వరుణుడి ముప్పు. భారీ వర్షం పడే సూచలను ఉన్నాయంటున్న వాతావరణ శాఖ.

ఐపీఎల్ పునఃప్రారంభానికి వరుణుడి ముప్పు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 శనివారం నాడు పునఃప్రారంభం అవనుంది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల ఈ మెగా లీగ్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే శనివారం నాడు జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే కొన్నిరోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం కూడా చెరువును తలపించేలా మునిగిపోతోందీ వర్షం కారణంగా.

శనివారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటోంది. అయితే చిన్నస్వామి స్టేడియంలో అత్యద్భుతమైన డ్రైనేజి వ్యవస్థ ఉంది. కాబట్టి ఎంత వర్షం పడినా మ్యాచ్ జరగొచ్చు. కానీ సజావుగా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందా? అనేది అనుమానమే.

Next Story