ప్లే ఆఫ్స్ ముందు ఆర్సీబీకి భారీ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ దూరం

by Harish |

ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మిగతా మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ దూరం కానున్నాడు.

ప్లే ఆఫ్స్ ముందు ఆర్సీబీకి భారీ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మిగతా మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు బాధ్యతల కారణంగా అతను ఐపీఎల్‌ను వీడనున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం బెథెల్ స్వదేశానికి వెళ్లిపోతాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మిగతా మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను జట్టులోకి తీసుకుంది. రూ. 2 కోట్లకు అతనితో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో సీఫెర్ట్ 226 రన్స్‌తో టాపార్డర్‌లో ఇంపాక్ట్ ఫర్ఫామెన్స్ చేశాడు. ఈ నెల 26న లక్నోతో ఆర్సీబీ చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు సీఫెర్ట్ జట్టులో చేరనున్నాడు.


Next Story