కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన SRH.. గుజరాత్ ఘన విజయం

by Gantepaka Srikanth |

కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు చేతులెత్తేసింది.

కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన SRH.. గుజరాత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు చేతులెత్తేసింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్(Gujarat Titans) చేతిలో ఘోర పరాభవం పాలైంది. శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో గెలుపొందింది. దీంతో దాదాపు హైదరాబాద్ జట్టు ఇంటిబాట పట్టినట్లు తెలుస్తోంది.

ఇక టాస్ ఓడి ముందుగా గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లతో సహా టాప్ ఆర్డర్ మొత్తం అదరగొట్టారు. సాయి సుదర్శన్ (48), శుభ్‌మన్ గిల్ (76), జాస్ బట్లర్ (64), వాషింగ్టన్ సుందర్ (15) రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేశారు. SRH బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు, పాట్ కమ్మిన్స్, జీషన్ అన్సారీ తలో వికెట్ తీశారు. గిల్‌ను హర్షల్ పటేల్ రన్ అవుట్ చేశారు.

ఇక 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన SRH ఓపెనర్లు బాగానే రాణించారు. ట్రావిస్ హెడ్ (20) స్వల్ప స్కోరుకే అవుట్ అవగా, అభిషేక్ (74) హాఫ్ సెంచరీతో రాణించారు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (23), అనికేత్ వర్మ (3), ఇషాన్ కిషన్ రెడ్డి (13), మెండీస్ (0), నితీష్ కుమార్ రెడ్డి (21), కమ్మిన్స్ (19) పరుగులతో చివరివరకూ పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీయగా, ఇషాన్ శర్మ, కోటేజ్ తలో వికెట్ తీశారు.

Next Story