- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ ఎలిమినేషన్‌కు కారణం అదే: హెడ్‌కోచ్ వెట్టోరీ
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పుకుంది. ఈ టీం పేలవ ప్రదర్శనకు కారణమేంటో హెడ్ కోచ్ వెట్టోరీ వెల్లడించాడు.

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆడిన 11 మ్యాచుల్లో కేవలం మూడు విజయాలతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫెయిలవడం వెనుక కారణాన్ని హెడ్ కోచ్ డానియల్ వెట్టోరీ వివరించారు. ‘ఈ ఏడాది పిచ్‌లు మేం అనుకున్నట్లు లేవు. గతేడాది ఉప్పల్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఈసారి అలా జరగలేదు. పవర్‌ప్లేలో పేసర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లు తయారు చేశారు. ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ పవర్‌ప్లే బౌలర్లున్నారు. వారు ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు’ అని వెట్టోరీ చెప్పాడు. తమ ఆటగాళ్లు సహజంగానే ఎగ్రెసివ్‌గా ఆడతారని, కానీ ఈసారి మాత్రం పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకే ప్రయత్నించారని ప్లేయర్లను వెనకేసుకొచ్చాడు.
అయితే వెట్టోరీ చెప్పిన మాటల్లో కూడా కొంత నిజముందనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఏడాది ఉప్పల్‌లో ఆడిన 11 ఇన్నింగ్సుల్లో కేవలం నాలుగు సార్లే జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. అదే, గతేడాది అయితే ఆడిన 12 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక, ఢిల్లీ-హైదరాబాద్ మ్యాచ్ వర్షార్పణం అవడంతో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad).. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.






