- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ఏడు జట్లు.. ఎవరికి ఎన్ని విజయాలు కావాలి?
ప్రస్తుతం ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో ఏడు జట్లున్నాయి. వీటిలో టాప్-4లో నిలవడానికి ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే..?

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ (IPL 2025) ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే మూడు టీమ్స్ తప్పుకున్నాయి. పేలవ ప్రదర్శన కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లేఆఫ్స్ చేరేది నాలుగు జట్లే అయినా.. ఇంకా ఏడు జట్లు ఈ స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. మరి ప్లేఆఫ్స్ చేరాలంటే ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలో చూద్దామా..?
ఆర్సీబీ: ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన ఆర్సీబీ ప్రస్తుతం 16 పాయింట్లతో ఉంది. మరో మూడు మ్యాచులు ఆడాల్సిన ఆర్సీబీకి ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమైంది. మిగతా మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం ఖాయం. అదే రెండు గెలిస్తే టాప్-2లో నిలుస్తుంది.
పంజాబ్ కింగ్స్: లక్నోపై విజయం పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలను బాగా మెరుగుపరిచింది. మరో మూడు మ్యాచులు ఆడాల్సిన పంజాబ్.. వీటిలో రెండు విజయాలు సాధిస్తే కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్ గెలిచినా.. మిగతా టీమ్స్ ఫలితాలు, నెట్ రన్ రేట్ వల్ల పంజాబ్ ప్లేఆఫ్స్ చేరొచ్చు.
ముంబై ఇండియన్స్: వరుసగా ఆరు విజయాలతో ఊపుమీదున్న ముంబై.. ఆడిన 11 మ్యాచుల్లో 7 విజయాలు సాధించింది. మొత్తం 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఈ టీం మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు గెలిస్తే కచ్చితంగా (IPL 2025) ప్లేఆఫ్స్ చేరుతుంది.
గుజరాత్ టైటాన్స్: ఆడిన పది మ్యాచుల్లోనే ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది జీటీ. ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు బుక్ చేసుకున్నట్లే.
ఢిల్లీ క్యాపిటల్స్: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షార్పణం అవడం ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అయితే ఈ టీం మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు విజయాలు సాధిస్తే.. డీసీ కూడా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.
కోల్‌కతా: డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఈసారి ప్లేఆఫ్స్ చేరుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ టీం మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింట్లోనూ గెలిచినా కూడా ఆ జట్టు వద్ద 17 పాయింట్లే ఉంటాయి. అప్పటికీ కేకేఆర్ ప్లేఆఫ్స్ బెర్తు కన్ఫర్మ్ అవ్వదు. నెట్ రన్ రేట్, మిగతా జట్ల ఓటములపై ఆధారపడాల్సి ఉంటుంది.
లక్నో: ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో పూర్తిగా మిగతా జట్ల ఓటములపై ఆధారపడి ఉన్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ జట్టు కూడా మరో మూడు మ్యాచులు ఆడాలి. ఇవన్నీ గెలిచినా కూడా లక్నో వద్ద 16 పాయింట్లే ఉంటాయి. ఈ పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం కష్టం. కాబట్టి మిగతా జట్ల మ్యాచుల ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుకోవడం తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు.






