IPL 2025 : రాజస్థాన్ జట్టుకు భారీ షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు

by Harish |

గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.

IPL 2025 : రాజస్థాన్ జట్టుకు భారీ షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు
X

దిశ, స్పోర్ట్స్ : గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆ ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ మరో షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి రూ.24 లక్షల భారీ జరిమానా విధించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత సమయం లోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదని తెలిపింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్‌ను ఎదుర్కోవడం రాజస్థాన్‌కు ఇది రెండోసారి. చెన్నయ్‌తో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్‌కు గురైంది. ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌కు రూ. 12 లక్షల ఫైన్ పడింది. ఇప్పుడు రెండోసారి ఐపీఎల్ నిబంధనను ఉల్లంఘించడంతో శాంసన్‌‌‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అలాగే, ఇంపాక్ట్ ప్లేయర్‌ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు కూడా ఫైన్ పడింది. రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఏది తక్కువైతే అది) జరిమానా వేశారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. రెండింట మాత్రమే నెగ్గింది.


Next Story