ipl 2025 : భారత్ మాతా కీ జై నినాదాలతో మార్మోగిన స్టేడియం.. ఐపీఎల్ ముగింపు వేడుకలు భారత ఆర్మీకి అంకితం

by Harish |

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ జరగనుంది.

ipl 2025 : భారత్ మాతా కీ జై నినాదాలతో మార్మోగిన స్టేడియం.. ఐపీఎల్ ముగింపు వేడుకలు భారత ఆర్మీకి అంకితం
X

దిశ, స్పోర్ట్స్ : మరికాసేపట్లో ఐపీఎల్-18వ సీజన్ టైటిల్ పోరు ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అంబరాన్ని అంటేలా ముగింపు వేడుకలు జరిగాయి. ‘ఆపరేషన్ సింధూర్‌’ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ క్లోజింగ్ సెర్మనీని బీసీసీఐ భారత ఆర్మీకి అంకితం చేసింది. మన సాయుధ దళాలు చూపించిన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని కొనియాడుతూ ముగింపు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించింది. ప్రేక్షకులు కూడా జాతీయ జెండాతో స్టేడియానికి తరలివచ్చారు. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆయన టీమ్ దేశభక్తి గీతాలు ఆలపించారు. ‘మా తూఝే సలాం’ సాంగ్ పాడేటప్పుడు స్టేడియం మొత్తం ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మారుమోగింది. అలాగే, భారత ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Next Story