- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : రాహుల్ విధ్వంసం.. ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్-18లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 స్కోరు చేసింది. టిమ్ డేవిడ్(37 నాటౌట్), ఫిల్ సాల్ట్(37) పర్వాలేదనిపించారు. అనంతరం 164 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. డుప్లెసిస్(2), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(7), అభిషేక్ పొరెల్(7), కెప్టెన్ అక్షర్ పటేల్(15) విఫలమవడంతో ఢిల్లీకి ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. అయితే, రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించిన అతను 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్(3 నాటౌట్)తో కలిసి ఢిల్లీకి సూపర్ విక్టరీ అందించాడు.






