కీలక పోరుకు సిద్ధమైన ఆర్సీబీ.. లక్నో ఏం చేస్తుందో?

by Harish |

ఐపీఎల్-18‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది.

కీలక పోరుకు సిద్ధమైన ఆర్సీబీ.. లక్నో ఏం చేస్తుందో?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు చివరి గ్రూపు మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్ కూడా. క్వాలిఫయర్ 1 బెర్త్ దక్కాలంటే లక్నోపై గెలవడం బెంగళూరుకు తప్పనిసరి. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్స్‌ టేబుల్‌లో 17 పాయింట్లతో ఆ జట్టు మూడో స్థానంలో ఉన్నది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై నెగ్గిన పంజాబ్ 19 పాయింట్లతో టాప-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. మరో స్థానం కోసం ఆర్సీబీ పోటీపడుతుంది. లక్నోపై గెలిస్తే బెంగళూరుకు ఢోకా లేదు. కానీ, ఓడితే మాత్రం మూడో స్థానానికే పరిమితమవుతుంది. అదే జరిగితే 19 పాయింట్లతో పంజాబ్ అగ్రస్థానంలో.. గుజరాత్ 18 పాయింట్లతో రెండో స్థానంలో క్వాలిఫయర్ 1‌కు చేరుకుంటాయి. క్వాలిఫయర్ 1 ఆడటం ద్వారా ఫైనల్‌కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా టైటిల్ పోరుకు క్వాలిఫై అవ్వొచ్చు. ఓడినా క్వాలిఫయర్ 2 ద్వారా మరో చాన్స్ ఉంటుందన్న విషయం తెలిసిందే. గత మ్యాచ్‌లో గుజరాత్‌‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న లక్నోను మట్టికరిపించడం ఆర్సీబీకి కాస్త సవాల్‌తో కూడుకున్నదే.


Next Story